HomeUncategorizedOsmania performs rare surgery : ఉస్మానియా అరుదైన స‌ర్జ‌రీ...చిన్నారికి లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌...!

Osmania performs rare surgery : ఉస్మానియా అరుదైన స‌ర్జ‌రీ…చిన్నారికి లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో డాక్టర్ఉ అరుదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన శ‌స్ర్త చికిత్స‌ను విజయవంతంగా చేసారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి… విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసారు. తండ్రి లివర్ నుంచి కొంత భాగాన్ని సేకరించి… చిన్నారికి ఉస్మానియా వైద్యుల బృందం అమర్చింది. 4 గంటల పాటు క్లిష్ట శస్త్రచికిత్స కొనసాగింది.

ఆరోగ్యశ్రీ పథకం కింద డాక్టర్లు పూర్తిగా ఉచితంగా చికిత్స అందించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగంలో ఇలాంటి శస్త్రచికిత్సలు అత్యంత అరుదు అని డాక్టర్లు తెలిపారు. ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

తాజావార్తలు