
డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో దొరికిపోయింది చిగురుపాటి నమ్రత
వంశ్ టక్కర్‌కు రూ.5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చింది చిగురుపాటి నమ్రత .విశ్వసనీయ సమాచారంతో నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రాయదుర్గం పోలీసులు. ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.