క్రైమ్ మిర్రర్,సినిమా :- మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం దగ్గర అభిమానుల సందడి అంబరాన్నంటింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుని హ్యాపీ బర్త్‌డే అన్నా అంటూ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. తారక్ అన్న మా దేవుడు అంటూ ఫ్యాన్స్ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానుల ప్రేమను చూసిన ఎన్టీఆర్ కూడా ఇంటి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అభిమానులను చూసి చిరునవ్వుతో చేతులు ఊపుతూ విష్ చేసిన తారక్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. కొందరు అభిమానులు ఆయనతో షేక్‌హ్యాండ్ కోసం ఆరాటపడగా.. ఒక అభిమాని అయితే ఐరన్ బ్యారికేడ్ ఎక్కి మరీ తారక్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతనికి ఎన్టీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అభిమానులు భారీగా రావడంతో అక్కడ పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఎన్టీఆర్ టీమ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ కూడా లభించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ అర్ధరాత్రి విడుదలైంది. ఈ వీడియోకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో డ్రాగన్ గ్లింప్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు అభిమానుల దృష్టంతా దేవర 2 అప్‌డేట్‌పైనే ఉంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మరో సర్‌ప్రైజ్ వస్తుందా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.