విజయవాడ, క్రైమ్‌మిర్రర్: పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్సార్ వారసులు కారు. అయన పేరు చెప్పి అధికారంలోకొచ్చి మెడలు, మిద్దెలు కట్టుకున్నారు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం కాదు వైఎస్సార్ వారసత్వం. ప్యాలెస్ లో బ్రతికితే కాదు వైఎస్సార్ వారసత్వం. వైఎస్సార్ ఆశయాలు,ఐడియాలజి పాటించే వాళ్ళే నిజమైన వారసులు. కాంగ్రెస్ ను బలపరచడం అంటే వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడమని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డాడు . ప్రజలకోసం వెళ్లి చనిపోయాడు. ఈ మధ్య నాయకులు ఒక సారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందుబాటులో లేరు. సొంత పార్టీ నాయకులకు కూడా కనపడలేదు ,. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కలవడానికి వీలు లేదని అన్నారు.
ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నం. రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారు . దేశంలో , రాష్ట్రంలో రాజ్యాంగం బ్రతికి ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలి. విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయింది. మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలని అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ చట్టంలో పెట్టింది. హోదా వచ్చి ఉంటే పన్నుల రాయితీ ఉండేది. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కేంద్రమే నిర్మించి 35 లక్షల ఎకరాలను సస్యశామలం చేయాలని అనుకున్నారు .
రాజధాని నిర్మాణం కేంద్రమే అని హామీ ఇచ్చారు. కడప స్టీల్ , దుగరాజపట్నం, మెట్రో రైల్ . వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇలా ఎన్ని హామీలు . ఆనాడే కేంద్రం ఇచ్చిన హామీల విలువ అక్షరాల 5 లక్షల కోట్లు . కానీ విభజన తర్వాత ఒక్క హామీ నేటికి నెరవేరలేదని అన్నారు.
చంద్రబాబు , జగన్ ఇద్దరు కలిసి అభివృద్ధిని ఖూనీ చేశారు 11 ఏళ్లు దాటుతున్న రాజధాని లేని రాష్ట్రం అంటే అది ఏపీనే . రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే బాబు , జగన్ , పవన్ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారు . పోటీలు పడి మద్దతు ఇస్తున్నారు. జగన్ నవరత్నాలు అని మోసం. చంద్రబాబు సూపర్ సిక్స్ అని మోసం. గత 10 ఏళ్లలో ఉద్యోగాలు లేవని అన్నారు.
దేశానికి కాంగ్రెస్ అవసరం .
నేడు దేశం దారుణ స్థితిలో ఉంది. పెట్రోల్ వాడొద్దు అంటున్నారు, బయట తిరగొద్దు అని అంటున్నారు. బంగారం కొనొద్దు అంటున్నారు. దీనికి కారణం మన మోదీ గారు. ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే జనాల మీద పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక భారం ప్రభుత్వం , ఒక భారం ఆయిల్ కంపెనీలు , మూడో భారం మాత్రమే ప్రజల మీద వేశారు. నేడు భారం అని చెప్పి మొత్తం ప్రజల నెత్తిన వేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు లాభం పొందారు. ఇప్పుడు ధరలు పెరిగితే జనాల మీద రుద్దుతున్నారు . ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ చార్జీలు దారుణం. దేశంలో ఎక్కడ లేని ఛార్జీలు మనదగ్గర ఉన్నాయని మండిపడ్డారు.