Homeఆంధ్ర ప్రదేశ్వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ!

వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ!

•నంద్యాల ఎంపీగా ఛాన్స్
•లేకుంటే కర్నూలులో టీజీ భరత్ పై..
•పక్కా వ్యూహంతో జగన్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోటీ చేస్తారా? ఎంపీగా చేస్తారా? ఎమ్మెల్యేగా చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల కర్నూలు వచ్చి మరి మంత్రి టీజీ భరత్ పై విరుచుకుపడ్డారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. దీనిపై కౌంటర్ ఇచ్చారు మంత్రి భరత్. మధ్యలో ఎంపీ బైరెడ్డి శబరి వచ్చారు. సోదరుడు సిద్ధార్థ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు టీజీ వెంకటేష్ సైతం రంగంలోకి దిగారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బరిలో దిగేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

అనతి కాలంలోనే గుర్తింపు..
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయతను చూపడంలో ముందు వరుసలో ఉంటారు సిద్ధార్థ రెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గంలో 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే అప్పటివరకు రాయలసీమలో మాత్రమే గుర్తింపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో కీలకమైన శ్యాప్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా కానీ.. ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలని భావించారు. అందుకు సమీకరణలు కుదరలేదు. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగుతారని అర్థం అవుతుంది.

మొన్నటి ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం..
వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. శ్రీశైలం నుంచి కానీ.. పాణ్యం నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. లేకుంటే నంద్యాల ఎంపీగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆయన పేరు లేకుండా పోయింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా అభ్యర్థుల కు మద్దతుగా ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా రాయలసీమలో చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు సిద్ధార్థ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఎప్పటికప్పుడు కూటమిని ఎండగడుతున్నారు.

సుదీర్ఘ నేపథ్యం..
ప్రస్తుతం నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ఉన్నారు. ఆమె స్వయాన తన పెదనాన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కుమార్తె. వీరి కుటుంబానికి మంచి నేపథ్యం ఉంది. బైరెడ్డి శేష శయనా రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి అయ్యారు. ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ 2014 ఎన్నికల కు ముందు తన పెదనాన్న రాజశేఖరరెడ్డి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సిద్ధార్థ రెడ్డి. కానీ తరువాత జరిగిన పరిణామాలతో రాజశేఖర్ రెడ్డి తిరిగి బిజెపిలో చేరారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం వైసిపి లోనే ఉండిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. లేకుంటే మంత్రి టీజీ భరత్ పై ప్రయోగిస్తారని కూడా సమాచారం. మరి జగన్ ఆలోచన ఎలా ఉండబోతుందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు