క్రైమ్ మిర్రర్,సినిమా:- జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవర మూవీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరపైకి వస్తుంది అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ షాడో లుక్ లో కనపడడం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. రాబోయే నెల మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ అప్డేట్ పై కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఈ సినిమా రాక కోసం మరొక ఏడాది పాటు వేచి చూడాల్సి వస్తుంది అని నిరాశ చెందుతున్నారు. కాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్-2 మరియు దేవర సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో రాబోయే సినిమాపై అభిమానులు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కాబోతుండడంతో.. అప్పటివరకు ఫ్యాన్స్ కచ్చితంగా వేచి చూడాల్సిందే.
Breaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం…బస్సులు బంద్…!
Breaking: ఆర్టీసీ సమ్మె ప్రారంభం…బస్సులు బంద్…!