క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు శుభవార్త. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.అర్హులైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఎంపిక జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులలో ఎవరైనా మరణించినట్లయితే, వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని ఆమె సూచించారు. ఈ నిర్ణయంతో అర్హులైన ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా దక్కుతుందని ఆశిస్తున్నారు.
తల్లికి వందనం.. పథకంలో మరో బిగ్ అప్డేట్!
గ్యారంటీ లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం.. ప్రధానమంత్రి ముద్రా యోజన!