HomeUncategorizedఇసుక‌, మ‌ట్టిదందాల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లొద్దు....మంత్రి నారా లోకేష్‌...!

ఇసుక‌, మ‌ట్టిదందాల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లొద్దు….మంత్రి నారా లోకేష్‌…!

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్: మ‌ట్టి, ఇసుక దంద‌ల్లోకి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకూడ‌ద‌ని టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేస్ హెచ్చ‌రించారు. రెవెన్యూ విష‌యాల్లో ఎమ్మెల్యేలు క‌లుగ చేసుకోవ‌ద్ద‌న్నారు. పార్టీ నిబంధ‌నల‌కు అనుగుణంగా న‌డువాల‌ని, పార్టీ బీ ఫాం ఇస్తేనే మళ్లీ పోటి చేస్తామ‌న్నా విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మంగళవారం నిర్వహించిన తెదేపా ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి లోకేశ్ మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూలత ఉన్నా.ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి నష్టం జరుగుతుంటే ఉపేక్షించేందుకు అదినేత సిద్ధంగా లేరని లోకేశ్ వ్యాఖ్యానించారు సమన్వయకర్తలు భూమిరెడ్డి రామ్ గోపాల్రెడ్డి, బీదా రవిచంద్ర, సుజయ కృష్ణ రంగారావు, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు