
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐపీఎల్ 2026 కి సంబంధించి ఆయా జట్ల లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నయి. రిటెన్షన్ గడువు దగ్గర పడడంతో ఆయా జట్ల ఆటగాళ్ల మార్పుల చర్చల్లో వేగం పెరిగింది. ఇప్పటికే ఆయా జట్టులో ఉండేటువంటి ప్లేయర్ల పూర్తి జాబితాను విడుదల చేయాల్సిన సందర్భంలో ఆయా జట్లు కొంతమందిని ట్రేడ్ చేసుకుంటుండగా మరికొన్ని జట్లు అనవసరపు ప్లేయర్లను వదులుకుంటున్నారు. ఈ సందర్భంలోనే తాజాగా లక్నో సూపర్ జేయింట్స్ ఆల్రౌండర్ అయినటువంటి శార్దూల్ ఠాకూర్ ను ముంబై జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించింది. రెండు కోట్ల ధరకు శార్దూల్ ఠాకూర్ ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకున్నట్లు ఐపిఎల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. రవీంద్ర జడేజా మరియు సంజు సాంసన్ ఇద్దరు కూడా రెండు టీంలకు ఎక్స్చేంజ్ అయిన వార్తలు నిజమే అని క్రిక్బజ్ వెల్లడించింది. మరోవైపు సామ్ కరణ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేరుతున్నారు. డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆయా జట్టులకు సంబంధించి అనవసరపు ప్లేయర్లను వదిలేస్తున్నారు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ని ఆ జట్టు వదిలేసినట్లు.. శమిని తీసుకోవడానికి లక్నో మరియు ఢిల్లీ జట్లు ఆసక్తిగా ఉన్నాయి అని క్రిక్బజ్ వెల్లడించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు వేలానికి ముందే క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం అందింది. అలాగే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ షెఫర్డ్ ని కూడా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టేడియం మార్పు చేస్తున్నట్లు.. ఇటీవల అనధికారికంగా వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
Read also : ఉగ్రకుట్రకు అడ్డగా అల్ ఫలాహ్ వర్సిటీ, స్థాపకుడి అక్రమాలపై ఈడీ నజర్!
Read also : Terror Module: 4 నగరాలు.. 32 కారు బాంబులు, వామ్మో ఊహించుకుంటేనే భయమేస్తుంది!





