Homeలైఫ్ స్టైల్నువ్వుల నూనెతో ఎన్నో లాభాలు.. ఆరోగ్యానికి సహజ రక్షణ ఇదే..!

నువ్వుల నూనెతో ఎన్నో లాభాలు.. ఆరోగ్యానికి సహజ రక్షణ ఇదే..!

క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్:- మన వంటింట్లో ఎప్పటి నుంచో ఉన్న నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్న గింజలైనా.. వీటిలో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే నువ్వులు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే పాతకాలం నుంచే నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

రోగనిరోధక శక్తికి తోడ్పాటు

నువ్వుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.

షుగర్, బీపీ నియంత్రణ

నువ్వులు, నువ్వుల నూనెను పరిమితంగా తీసుకోవడం వల్ల మధుమేహం, బీపీ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఎముకలకు బలం

నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు బలంగా ఉండటానికి, ఆస్టియోపోరోసిస్ సమస్యను తగ్గించేందుకు సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది

నువ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి. దీంతో గుండె ఆరో్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది.

నోటి ఆరోగ్యానికి

ఉదయాన్నే ఒక టీ స్పూన్ నువ్వుల నూనెతో కొద్దిసేపు పుక్కిలిస్తే నోటిలో బ్యాక్టీరియా తగ్గుతుంది. నోటి దుర్వాసన కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఆస్త్మా సమస్యలో ఉపశమనం

నువ్వుల నూనె పుక్కిలించడం వల్ల శ్లేష్మం తగ్గి శ్వాస తీసుకోవడంలో కొంత ఉపశమనం కలిగించొచ్చు.

పాలిచ్చే తల్లులకు ఉపయోగం

పాలిచ్చే తల్లులు కొద్దిగా నువ్వులు తీసుకుంటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. శరీరానికి కాల్షియం అందించడంలో ఇవి ఉపయోగపడతాయి.

కీళ్ల నొప్పులకు ఉపశమనం

నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుంటే కండరాలు రిలాక్స్ అవుతాయి. కీళ్ల నొప్పులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.రోజువారీ ఆహారంలో కొద్దిగా నువ్వులు లేదా నువ్వుల నూనె చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు