క్రైమ్ మిర్రర్,సినిమా:- రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆర్‌సీ17 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఘన విజయాన్ని అందుకోవడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కథకు తగ్గ నటీనటులు, లుక్స్, ఇతర కీలక అంశాలను సుకుమార్ టీమ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయంపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మొదట కియారా అద్వానీ, రష్మిక మందన్న, నయనతార వంటి పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా రామ్‌చరణ్, కియారా అద్వానీ గతంలో రెండు సినిమాల్లో కలిసి నటించడంతో ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతుందని అభిమానులు భావించారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్ కొత్త పెయిర్‌ను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పడుకునే ముందు గ్లాసు ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి సారా అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ధురంధర్ లో యలీనా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్‌ను ఆర్‌సీ17 లో కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెకు కథ గురించి వివరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సారా అర్జున్‌నే హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను కేవలం ఇండస్ట్రీ వర్గాల ప్రచారంగానే చూడాలి.సారా అర్జున్ చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం హీరోయిన్‌గా కొనసాగుతోంది. ధురంధర్ తో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఆమె కెరీర్‌కు ఇది మరో కీలకమైన మలుపుగా మారే అవకాశం ఉంది.
అయ్యగారే నెం.1.. హీరోగా డైరెక్టర్ తమ్ముడు.. ఫ్యాన్స్ అసోసియేషన్ మూవీ టైటిల్ చూశారా?
మరోవైపు ఆర్‌సీ17 కోసం రామ్‌చరణ్ తన లుక్‌లో భారీ మార్పు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పాత్రకు తగ్గట్టుగా దాదాపు 15 కిలోల వరకు బరువు తగ్గి, లీన్ ఫిజిక్‌తో కనిపించనున్నారని సమాచారం. పొడవాటి జుట్టుతో ఇప్పటివరకు చూడని విధంగా కొత్త లుక్‌లో చరణ్‌ను చూపించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.రామ్‌చరణ్, సారా అర్జున్ జోడీ ఖరారైతే ఇది టాలీవుడ్‌లో పూర్తిగా కొత్త కాంబినేషన్‌గా నిలుస్తుంది. సుకుమార్ సినిమాల్లో కథానాయిక పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండటంతో సారా పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అయితే హీరోయిన్ విషయంలో అధికారిక స్పష్టత రావాలంటే చిత్రబృందం ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
