క్రైమ్ మిర్రర్, సినిమా :- సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం కొనసాగుతోంది. తాజాగా విరూపాక్ష, వృషకర్మ చిత్రాల దర్శకుడు కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సప్తగిరి కీలక పాత్రలో కనిపించనున్నారు.అయ్యగారే నెం.1 గా గుర్తింపు పొందిన అక్కినేని అభిమాని నాగరాజుతో ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గ్రామీణ వాతావరణంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌లో హీరో మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా, హీరోయిన్ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షురాలిగా కనిపించనున్నారు. తమ అభిమాన హీరోల సినిమాల రికార్డుల విషయంలో ఇద్దరి మధ్య జరిగే పోటీని మోషన్ పోస్టర్‌లో ఆసక్తికరంగా చూపించారు.
వర్షాకాలంలో బొప్పాయి తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఈ కథ ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో థియేటర్ల వద్ద అభిమాన సంఘాల మధ్య జరిగే పోటీ, తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ జరిగే వాదనలు, వాటి నుంచి పుట్టే సరదా సంఘటనలను సినిమాలో వినోదాత్మకంగా చూపించనున్నట్లు సమాచారం. అభిమానుల మధ్య మొదలయ్యే పోటీ చివరకు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, వారి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది అనేది కథలో ప్రధాన అంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ చిత్రానికి సి.హెచ్. రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్‌పై వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. ఎంఎల్ రాజా సంగీతం అందిస్తుండగా, మోహన్ చారి సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజా రవీందర్, బాబు మోహన్, వంశీధర్ గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, జబర్దస్త్ అప్పారావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.మోషన్ పోస్టర్‌తోనే ఈ సినిమా కథపై ఆసక్తి పెరగడంతో, వివేక్ దండు హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అలాగే నాగరాజు సినిమాలోనూ కనిపిస్తారా, లేక ప్రమోషన్‌లో భాగంగానే ఆయనను తీసుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
విమల్ యాడ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ హీరోలకు భారీ జరిమానా తప్పదా?
