Homeతెలంగాణkalvakuntla kavitha: మన పార్టీ పేరు "తెలంగాణ రాష్ట్ర సేన"(TRS)...!

kalvakuntla kavitha: మన పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన”(TRS)…!

  • 20 ఏళ్లుగా నేను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు

  • మన సంస్కృతి బతుకమ్మ వచ్చాక బలం వచ్చింది

  • బీజేపీ కి తెలంగాణ రావటమే ఇష్టం లేదు

  • ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు

  • ఇప్పుడు ఇళ్లు మాత్రమే అలికం. ముందున్నది ముసళ్ల పండగ

  • మునిరాబాద్ (అద్వయ కన్వేషన్) వేదిక పై కవిత వెల్లడి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని నేడు మునిరాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణం (అద్వయ కన్వేషన్) వేదిక పై పార్టీ పేరును ప్రకటించారు, పార్టీ జెండా ఎలా ఉంటుందో తెలిపారు. పార్టీ పేరుతెలంగాణ రాష్ట్ర సేన“(TRS), పార్టీ జెండా పసుపు నీలం, ఆకుపచ్చ రంగుల్లో తెలంగాణ రాష్ట్ర సేన జెండా, జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరు, కింద ఆకుపచ్చ రంగు పట్టి దాని మధ్యలో తెలుగు లో తెలంగాణ రాష్ట్ర సేన పేరు ఉంటుందని తెలిపారు..

సందర్బంగా కవిత మాట్లాడారు… మన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన, అంటూ తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ది జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా జీవితంలో ఇదొక మరుపురాని రోజు, మనందరం కలుసుకొని పనిచేసే విధంగా ఆ దైవం చేసిందని నమ్ముతున్నా అన్నారు.

తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, అనేక రకాల కష్టాలు పడిన,రాష్ట్రము వస్తే చాలని భావించిన వాళ్లకు నా హృదయపూర్వక నమస్కారం తెలుపున్నను అన్నారు. సింగరేణి కార్మికులంటే ఇష్టం, అంతకన్నా ఆడబిడ్డలంటే ఇంకా ఇష్టం, జెన్ జీ వారసులు, యూత్ కు పేరు పేరున నమస్కారం తెలిపారు.

ఏం జరుగుతుందని ఇవ్వాళ రాష్ట్రంలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్లుగా నేను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు అన్నారు. ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం ద్వారా తెలియ చేశాం అన్నారు. తెలంగాణ రాష్ట్రము లో జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యింది, మన సంస్కృతి గురించి చెప్పుకోవటానికి బతుకమ్మ వచ్చాక బలం వచ్చింది. ఇది మా సంస్కృతిని అని బతుకమ్మ పాట ద్వారా పున పరిచయం చేసకున్నాం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది మా జాగృతి ఆడబిడ్డలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం కలలు కన్నా తెలంగాణ రాలేదు, మన కలలు ఇప్పటికీ కూడా నిజం కాలేదు,

కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది. ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉంది. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి. ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం. మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా, ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా అన్నారు.

తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది, నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు, ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి, అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేన గా వస్తున్నాం అని తెలిపారు.

పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చు అని అందుకోసమే ఈ పార్టీ మీ ముందుకు వచ్చింది అన్నారు. రాజకీయ పార్టీకి రాజకీయ ఆత్మ ఉండాలి. అజెండా ఉండాలి, బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది అని అన్నారు.

తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా అమ్మతనంతో, ఆర్ధితో పాలన జరిగినప్పుడే కష్టాలు తీరుతాయి. రైతాంగ పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఇలా సాగుతూనే ఉంది. చాకలి ఐలమ్మ, గద్దరన్న, మారోజు వీరన్న సహా అనేక మంది పోరాటం చేస్తేనే ఇలా మార్పులు వచ్చాయి అన్నారు.

అమర వీరులు, కేసీఆర్ గారు అనేక మంది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. సమ్మక్క సారక్క నాటి నుంచే సామాజిక పోరాటం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ, పాపన్న గౌడ్, పంతు నాయక్ గారు, జనార్ధన్ రావు గారి స్ఫూర్తిని తీసుకుంటాం అని ఆమె తెలిపారు. రాజ్యాంగ బద్దంగా రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు ఊరికే రాలేదు అని ఆమె మాట్లాడారు..

బీజేపీ కి తెలంగాణ రావటమే ఇష్టం లేదు:

తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు. మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ, మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు అన్నారు.

 

ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన ఏడు మండలాలు తీసుకున్నారు. అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు. ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి, పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి. దానిపై జాగృతి తరఫున మేము మాట్లాడాం. ఆంధ్రా వారికి, కేంద్రానికి లేఖ రాశాం. మీకు సిగ్గు ఉంటే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలు తెలంగాణకు తేవాలి అని ఆమె బిజెపికి నాయకులకు సవాల్ విసిరారు.

ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు:

నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెచ్చుకున్నాం. పదేళ్లలో నీళ్ల కోసం బీఆర్ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చింది. పాలమూరు, కాళేశ్వరం కోసమే లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని నేను బాధతో చెబుతున్నా అన్నారు.

ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు, ఆనాడు చేనేత కార్మికులు చనిపోతే బిక్షమెత్తి సాయం చేసిన వ్యక్తి కేసీఆర్, ఈనాటి కేసీఆర్ మరమనిషి, మారిన మనిషి అని మండిపడ్డారు. వెలుగుమట్లలో, హైడ్రాలో ఇళ్లు కూలితే వచ్చారా, అయ్యా కేసీఆర్ రావాలి అంటే కూడా రాలేదు. చేవెళ్ల దగ్గర కష్టమొస్తే వచ్చారా? ఆయన మారిన మనిషి, మర మనిషి. మన మనిషి కాదు,

గుంటనక్కలు, తోడేళ్లలో ఖైదీ అయిన మర మనిషి, దుఖంతో చెబుతున్న మాటలు ఇవి. సంతోషంతో కాదు, ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేశారు. కానీ పాలమూరు కోసం ఏం చేయలేదు, ఆనాటి కేసీఆర్ అయితే అక్కడే కుర్చీ వేసుకొని దాన్ని పూర్తి చేసేవారు.కానీ మారిన కేసీఆర్ మాత్రం పంజాబ్, గుజరాత్, బీహర్ కు పోయారు. రాష్ట్రంలో మొత్తం పీకి కట్టలు కట్టామని, నేషనల్ పార్టీ అంటూ పోయారు అని హెద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకోని ఉంటే పాలమూరు రంగారెడ్డి పారకపోయేదా? నేను ఎన్ని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెబుతలేరు అన్నారు. దీనికి సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేలా చేస్తుంది అన్నారు.

సింగరేణి గనిలో కార్మికుడు చనిపోతే చూసి వచ్చిన వ్యక్తి, తెలంగాణ వచ్చాక ఏమైంది ఆ ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? నాకు తండ్రి కావచ్చు అది వేరే విషయం కేసీఆర్ గారు రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు అంటే ఆయనకు పెద్దగా తెలియదు, ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ గారు అంటున్నారు.

నా పిల్లలు తప్పు చేస్తే నేను వదిలివేస్తానా? ఒక కర్కోటక పాలకుడి పాలన నడుస్తోంది, అర్థరాత్రి ఇండ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన మన పాత కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తే వెంటనే పార్టీ పెట్టలేదు,అయన మారుతారేమోనని చాలా రోజులు వేచి చూశా అన్నారు.

ఆనాడు ఉద్యమకారులకు జరిగింది. ఇప్పుడు నాకు జరిగింది. కేసీఆర్ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడ పోయిండు. పదేళ్లలో 2 ఏండ్లకు ఒకసారి నామినేషన్ పదవులు ఇచ్చిన సరే 30 వేల పదవులు వస్తుండే, ఆనాడు అవహేళన చేసిన వారే అధికారంలో వచ్చిన తర్వాత మళ్లీ అవహేళన చేశారు అన్నారు.

ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే అమ్మతనం, మమకారం పోయింది. అందుకే అంటున్న ఆయన మన కేసీఆర్ కాదు మారిన మర మనిషి కేసీఆర్ అని ఆమె తెలిపారు. అందుకే నేను ఈ పార్టీ పెట్టి వస్తున్నా. ఈ గడ్డకు ఏమీ జరిగిన ప్రాణం అడ్డుపెట్టి పనిచేసే వాళ్లు కావాలి అన్నారు.

అవినీతి జరిగిందని అని చెప్పిన నన్ను సస్పెండ్ చేసి అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. ఆత్మ లేని మరబొమ్మ కేసీఆర్. ఇవ్వాళ మన కేసీఆర్ కాదు, అందుకే ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న నాతో పాటు వస్తారా? ఇప్పుడు ఇళ్లు మాత్రమే అలికం. ముందున్నది ముసళ్ల పండగ అని ఆమె గర్జించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు