Homeజాతీయంజాతీయ బావ‌జాలంతో జ‌న‌సేన అడుగులు...! నార్త్‌లో జెండా పాతేనా...?

జాతీయ బావ‌జాలంతో జ‌న‌సేన అడుగులు…! నార్త్‌లో జెండా పాతేనా…?

విజయవాడ, క్రైమ్‌మిర్ర‌ర్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో జాతీయ భావాలు ఎక్కువ. ఆయన ప్రాంతీయవాదానికంటే జాతీయ సమైక్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆ భావనతోనే నిన్న ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన సంకేతాలు పంపారు. తన రాజకీయ పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలన్న ఆలోచన పవన్ లో కనిపించింది. కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా… ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో ఒక స్పష్టమైన, కీలకమైన పాత్ర పోషించాలనే సంకల్పం పవన్ కళ్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా పవన్ నోటి నుంచి పదేపదే జాతీయవాదం రావడం వెనుక పక్క వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోందిపవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన ఆరాటం అధికారం కోసం కాదు. నిర్దిష్టమైన సిద్ధాంతాలతో పాటు దేశభక్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారతీయత అనే ఉమ్మడి సూత్రం, బలమైన జాతీయవాద భావజాలం ఆయనలో కనిపిస్తుంది.

Also Read:తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభిమాని కోరిక నెరవేర్చనున్న జనసేనాని

ఢిల్లీ సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు, ఎంచుకున్న అంశాలు తీసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కాకుండా… దేశ విశాల ప్రయోజనాల దృక్పథం ఉంది. అయితే జనసేన తాజా సంకేతాలు చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అడుగులు జాతీయస్థాయి వైపు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో సైతం బిజెపి తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అందుకే మోడీతో పాటు అమిత్ షా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ఉంటారు. అందుకే త్వరలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా ఒక బాధ్యత కట్టబెడతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ, సామాజిక సమతుల్యం, యువతను దేశ నిర్మాణం వైపు మళ్లించడం వంటి అజెండాలతో.. జనసేన ను జాతీయస్థాయిలో బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదు.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి రాజకీయాల్లో రాణించాలనుకునేవారు చాలా తక్కువ. ఒకవేళ వారు వెళ్లిన ప్రాంతీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తుంటారు తప్ప.. సమైక్య భావనతో కాదు. ఆ శూన్యతను భర్తీ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. హిందీ తో పాటు ఇంగ్లీష్ లో ఉన్న పట్టు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్, సనాతన ధర్మంపై ఆయనకు ఉన్న స్పష్టమైన స్టాండ్, జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడి, ఏపీ ప్రజల మద్దతు వెరసి.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సామర్థ్యం పవన్ కళ్యాణ్ సొంతం. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీ డిప్యూటీ సీఎం పదవితో ఆగిపోకుండా.. దేశ రాజకీయ గమనంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధం కావడం జనసైనికుల్లో జోష్ నింపుతోంది. ఢిల్లీ పెద్దలతో ఆయనకు వ్యూహాత్మక సంబంధాలు జాతీయ నాయకుడిగా తీర్చిదిద్దుతాయని జనసైనికులు బలంగా భావిస్తున్నారు.ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రీ…

Also Read:TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు