క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొద్దిరోజులుగా తనపై చేస్తున్న విమర్శలతోపాటు అనేక అంశాలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్.. తెలంగాణపై తనకు ఎంతో ప్రేమ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ఉన్న ఇష్టం రాజకీయాలకు అతీతమైనదన్నారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారన్న పవన్ కల్యాణ్.. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా తనను విమర్శిస్తున్న వారికి స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య తనను కొందరు హైదరబాద్‌లో ఎలా అడుగుపెడతావ్ అంటూ బెదిరిస్తున్నారని, ఇక్క నీకేం పని అని అడుగుతున్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అసలు మీరెవరయ్య తనను బెదిరించడానికి, బెదిరించే వాళ్ల అయ్య జాగీరా.. తెలంగాణ అంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాను భయపడలా.? అంటూ ప్రశ్నించిన డిప్యూటీ సీఎం.. తనపై దాడులు చేస్తామంటున్న వాళ్లకు తన ఇంటి అడ్రస్ తెలియజేయాలనే ఉద్ధేశంతోనే ఇంటి వద్ద ప్రెస్‌మీట్ పెట్టినట్టు చెప్పారు. తనకు తెలంగాణలో బెదిరింపులు కంటే ఆంధ్రలోనే బెదిరింపులు ఎక్కువని, తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తిని తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రాలో తనను తిరిగనీయమంటే వారాహి అనుమతి ఇచ్చిందీ కూడా తెలంగాణలోనే అని గుర్తించుకోవాలని సూచించారు. జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.
బెదిరింపులకు లొంగనని స్పష్టీకరణ..
తాను బెదిరింపులకు లొంగే రకం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆయన.. విభజించిన తీరును మాత్రమే అప్పట్లో విమర్శించినట్టు వెల్లడించారు. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చానని, పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరు తప్పని చెప్పినట్టు పేర్కొన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం అని వైఎస్ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారని, బెదిరింపులకు లొంగే రకం తాను కాదన్నారు. ఇప్పటి వరకు తాను తెలంగాణ నాయకులు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న పవన్ కల్యాణ్.. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదన్నారు. గద్దర్ బతికి ఉన్న రోజుల్లో మీరంతా ఎక్కడున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. గద్దర వచ్చి తనకు బండి కొనివ్వాలని అడిగితే.. రెండు రోజుల్లో కొనిచ్చానన్న పవన్ కల్యాణ్.. గద్దర్ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు మీరేం చేశారని ప్రశ్నించారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ ప్రారంభమైందని, విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం తనకు మొదట్లో తెలియలేదని, తెలిసిన తరువాత వదిలేయమని చెప్పినట్టు తెలిపారు. ఆ తరువాత ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లు పెట్టి తనను తిట్టారన్న పవన్..తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్ర వారే కారణమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయమనితమ నేతలు చాలా సార్లు అడిగారని, ఆంధ్రలోనే అధికారం కోరుకోని వాడిని తాను అని, తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ దేశంలో అంతర్భాగమన్న పవన్ కల్యాణ్?. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే పదవుల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు అయ్యారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ అంటే ఎంతో గౌరవం..
తెలంగాణ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పిన పవన్ కల్యాణ్.. అందుకే కొండగట్టు ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదని, భయపడేవాడిని అయితే పార్టీ పెడతానా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొదట గొంతు లేపేదీ జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్న ఆయన.. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే దానికి తాను కారణమా? అంటూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. మద్రాస్‌లో ఉన్న చిత్ర పరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందో గుర్తించాలన్నారు. ఇంకెంత కాలం ఆంధ్ర వాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారని, సడెన్‌గా ఇక్కడికి రావద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు ఎంతో గౌరవం ఉందన్న ఆయన.. తాను చెరువును కబ్జా చేసినట్టు కొందరు అంటున్నారని, అలా చేస్తే తనన ఇక్కడ ఉండనిస్తారా.? అని ప్రశ్నించారు. తన ఫామ్ హౌస్ కబ్జా అని తెలిస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తానని స్పష్టం చేశారు.