HomeUncategorizedపెద్ది సినిమాలో రజనీకాంత్ మిస్ చేసుకున్న పాత్ర ఇదేనా...!

పెద్ది సినిమాలో రజనీకాంత్ మిస్ చేసుకున్న పాత్ర ఇదేనా…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ నటన, కథ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, ఇప్పుడు పెద్ది సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో కీలకమైన గౌర్ నాయుడు పాత్ర కోసం మొదటగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్త అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

సినిమాలో గౌర్ నాయుడు పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కథను ముందుకు నడిపించే ఈ పాత్రలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు బుచ్చిబాబు రజనీకాంత్‌ను ఊహించారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

ప్రచారం ప్రకారం, కథ విన్న రజనీకాంత్ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పాత్రలో కొన్ని మార్పులు చేయాలని ఆయన కోరారట. దర్శకుడు ఆ మార్పులపై పని చేసినప్పటికీ, చివరికి ఆ పాత్రలో నటించేందుకు రజనీకాంత్ ముందుకు రాలేదని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ పాత్ర తనకు సరిపోదని భావించి ఆయన తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు శివరాజ్ కుమార్ ఎంపిక కావడంతో గౌర్ నాయుడు పాత్రకు మరింత బలం చేకూరిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ రజనీకాంత్ ఈ సినిమాలో నటించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేదని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ మార్కెట్లలో మరింత భారీ స్థాయిలో ప్రభావం చూపేదని అంటున్నారు. అయినప్పటికీ శివరాజ్ కుమార్ తన అనుభవంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం పెద్ది విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, రజనీకాంత్‌కు సంబంధించిన ఈ వార్త కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నిజంగా ఆ పాత్ర ఆయనకు వెళ్లిందా లేదా అనేది పక్కన పెడితే, గౌర్ నాయుడు పాత్ర ఇప్పుడు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనేది మాత్రం నిజం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు