-
మాజీ మంత్రి హస్తం
-
బాధితురాలు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : మాజీమంత్రి జోగి రమేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కోడలు మేఘనా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం వెనుక జోగి రమేష్ కుట్ర ఉంది అనేది మేఘనా తండ్రి చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇది సంచలనంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయనపై, కుమారుడు రాజీవ్తో సహా ఇతర కుటుంబ సభ్యులపై వరకట్ట వేధింపుల కేసులు, హత్యాయత్నం, గృహహింస ఆరోపణలతో కోడలు మేఘన కేసులు పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 15న మేఘన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రావెల్ బస్సు ఢీకొంది. దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందని బాధితులు ఆరోపించడం సంచలనగా మారింది.
ట్రావెల్ బస్సు ఢీ…
ఈనెల 15న జోగి మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడ వైపు కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు వీరి కారును కొట్టింది. దీంతో కారు పాక్షికంగా ధ్వంసం అయింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన సాధారణ ప్రమాదం కాదని.. తమను లక్ష్యంగా చేసుకుని జరిపిన హత్య ప్రయత్నం అయి ఉండవచ్చు అని మేఘన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల 16న ప్రమాదంపై మేఘన తండ్రికి కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని.. మాజీ మంత్రి జోగి రమేష్ పై అనుమానం ఉందని.. అందుకే లోతైన దర్యాప్తు జరపాలని ఆయన ఫిర్యాదులు కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెద్ద ఎత్తున నడిచిన పంచాయితీ…
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన గతంలో తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ ఆరోపించారు. అప్పట్లో జరిగిన పంచాయితీ సైతం బయటకు వచ్చింది. సంచలనంగా మారింది. మూడు నెలల కిందట మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్, గవర్నర్ లను కూడా ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా గతంలోనూ తమపై దాడులకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కారు ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీమంత్రి కుటుంబ ప్రమేయంపై పోలీసులు సమగ్ర ఆధారాలు సేకరిస్తున్నారా? లేదా? ఇది సాధారణ ప్రమాదమా? అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.
ఇవి కూడ చదవండి:
- దేశానికి యువశక్తి ఎంతో అవసరం…! ప్రధాని మోడీ…
-
హైదరాబాద్‌లో విషాదం…! నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి…
-
‘బలగం’ వేణుకు మార్చి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
-
రాజీవ్ చౌక్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. నేటి నుంచి 3 రోజుల పాటు కల్వర్టు నిర్మాణ పనులు: మున్సిపల్ కమిషనర్
