Homeతెలంగాణదసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్..!

దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్..!

  • సీఎం రేవంత్ రెడ్డితో ఆత్మీయ భేటీ.. సురేష్‌కు శుభాకాంక్షలు, ఆశీస్సులు

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనుముల రేవంత్ రెడ్డిని యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ దసరా పండుగ సందర్భంగా ఆత్మీయంగా కలిసినట్లు సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని సురేష్ తెలిపారు. సీఎం తనతో ఆప్యాయంగా మాట్లాడటం, శుభాకాంక్షలు తెలియజేయడం, ఆశీస్సులు అందించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రజల కోసం పనిచేసే తీరు తనకు స్ఫూర్తినిస్తాయని సురేష్ అన్నారు. ఆయనను కలిసిన సందర్భం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.కాగా, పెరుమాండ్ల సురేష్ ఎంబీఏ, బీఈడీ విద్యార్హతలు కలిగి ఉన్నట్లు తన పరిచయంలో పేర్కొన్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన యువ నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  అత్త‌పూర్‌లో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం
  2.  దేశానికి యువ‌శ‌క్తి ఎంతో అవ‌స‌రం…! ప్ర‌ధాని మోడీ…
  3. హైద‌రాబాద్‌లో విషాదం…! నీళ్ల బ‌కెట్‌లో ప‌డి చిన్నారి మృతి…
  4. ‘బలగం’ వేణుకు మార్చి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు