Homeజాతీయందేశానికి యువ‌శ‌క్తి ఎంతో అవ‌స‌రం...! ప్ర‌ధాని మోడీ...

దేశానికి యువ‌శ‌క్తి ఎంతో అవ‌స‌రం…! ప్ర‌ధాని మోడీ…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: దేశానికి యువ‌శ‌క్తి బ‌ల‌మైన‌ద‌ని, దేశానికి ఎంతో అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్ర‌వారం ఢిల్లీలోని భార‌త్ మండ‌ప‌లంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళన్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా చిన్మ‌య మిష‌న్ ఉత్స‌వాలు ఈనెల 25 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాట్లాడారు. ఈసంద‌ర్భంగా 1993లో ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్న‌యానంద‌తో జ‌రిగిన స‌మావేశాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గుర‌య్యారు. ఆ భేటిలోఆ భేటీలో దేశాభివృద్ధిలో యువత పాత్ర, యువశక్తిని పెంపొందించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు మోదీ వెల్లడించారు. స్వామిజితో స‌మావేశం జ‌రిగ‌ని కొన్నేళ్ల‌కే త‌న‌కు గుజ‌రాత్‌కు సేవా చేసే అవ‌కాశం క‌ల్పించార‌ని పేర్కొన్నారు.

అప్ప‌టి నుంచి త‌న విధానాలన్నింటిలోనూ యువతే కేంద్ర బిందువుగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు అలాగే, చికాగోలో జరిగిన ‘పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలీజియన్స్’ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ తాను చేసిన ఆహ్వానాన్ని స్వామి చిన్మయానంద అప్పట్లో అంగీకరించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు.చిన్మయ మిషన్ కేవలం ఒక సాధారణ సంస్థ కాదని, ఒక సనాతన ఆధ్యాత్మిక తత్వానికి రూపమని మోదీ అభివర్ణించారు. తన నాగరికతా మూలాల నుంచే భారతదేశం గుర్తింపు పొందుతోందని, మన దేశమే మన స్కృతికి జన్మస్థానమని మోదీ స్పష్టం చేశారు. చిన్మయ అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 300 రోజుల్లో 40,000 కిలోమీటర్లు ప్రయాణించి, లక్షలాది మందిని కలుసుకున్న యువతీయువకుల బృందాన్ని ప్రధాని ప్రశంసించారు.

ఇవి కూడ చ‌ద‌వండి
  1.  ఇషాన్‌కిష‌న్‌కు గాయం…! రెండో టీ20కి దూరం…
  2.  కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి…! ప‌ద‌వుల కోసం ఎదురు చూపులు…
  3.  ఫ్రాన్స్ లో అల్లర్లు…!ముస్లింల వలసదారులే కారణమా…?
  4.  నాది సౌత్ ఇండియా.. ఆ యాస రాక ఏం చేస్తుంది?: విమర్శలకు రష్మిక ఘాటు సమాధానం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు