Homeక్రైమ్మహారాష్ట్రలో పట్టపగలే దారుణ హత్య.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, ఇనుప రాడ్‌తో దాడి!

మహారాష్ట్రలో పట్టపగలే దారుణ హత్య.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, ఇనుప రాడ్‌తో దాడి!

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పట్టపగలే జరిగిన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని రద్దీగా ఉండే సిడ్కో ఎన్-7 ప్రాంతంలోని బజరంగ్ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి కిందపడేసిన ఓ వ్యక్తి.. అనంతరం హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి

ఈ ఘటనలో దేవేష్ అలియాస్ బంటీ దీక్షిత్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన జిమ్ నుంచి స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పవన్ పరాశర్ అనే వ్యక్తి తన కారుతో వెనుక నుంచి దీక్షిత్ స్కూటీని బలంగా ఢీకొట్టాడు. దీంతో దీక్షిత్ రోడ్డుపై పడిపోయాడు.

అనంతరం కారు నుంచి దిగిన పవన్.. తన వెంట తెచ్చుకున్న హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో దీక్షిత్ తల, ముఖంపై తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దీక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

హత్య అనంతరం పవన్ పరాశర్ నేరుగా సిడ్కో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన కారుతో పాటు ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

పాత కక్షలే కారణమా?

దేవేష్ దీక్షిత్ మెస్ నిర్వహించడంతో పాటు ప్లాట్ల వ్యాపారం కూడా చేసేవాడని తెలుస్తోంది. మృతుడికి, నిందితుడు పవన్ పరాశర్‌కు మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణంగానే హత్య జరిగిందా? లేక వ్యాపారపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పట్టపగలే రద్దీగా ఉండే రహదారిపై జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హత్యకు దారితీసిన అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

also read: మథురలో దారుణం.. భర్త, పిల్లలను వదిలి లివ్‌-ఇన్‌లో ఉంటున్న మహిళ హత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు