
క్రైమ్ మిర్రర్, తెలంగాణా న్యూస్ :-
భారత్ మరియు పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు రోజు రోజుకి దెబ్బ తింటూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం జరిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం లో ఇండియాలోని కొన్ని ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలోని కొన్ని సిటీలను నాశనం చేయాలనుకుంటే అందులో మొదటి స్థానంలో ఎకాన్మిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబై ను టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాదును టార్గెట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఆ దేశ పౌరులను లక్ష్యం చేసుకుని దాడి చేయదు. పొరపాటున అలా చేస్తే ఐక్యరాజ్యసమితి అలాగే ప్రపంచ దేశాల నుంచి ఆ దేశం పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తానైనా లేదా భారతదేశమైన ఆయా దేశాల పౌరులపై ఎటువంటి దాడులు చేయదు. కాబట్టి ఇరుదేశాలు కూడా ఆయా దేశాల సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఆర్మీ లతో అటాక్ చేస్తుంది. ఇక పాకిస్తాన్ ఇండియాను ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే కచ్చితంగా ముంబాయి అలాగే హైదరాబాద్ లేదా ఢిల్లీ వంటి సిటీలపై దాడులకు తెగబడుతుంది.
కారణాలు ఏంటంటే:-యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశమైనా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలని అనుకుంటుంది. అన్వాయుధాలు ప్రయోగించాలంటే కచ్చితంగా ఏ దేశమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ఆస్తి లేదా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఏ దేశమైనా దాడికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇలా చూసుకుంటే ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశం, అలాగే అభివృద్ధి చెందుతున్న నగరాలే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లిస్టులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సిటీలు కీలకంగా మారనున్నాయి. హైదరాబాదులో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆనాటి కాలంలో… అంటే గడిచిన రోజులలో… హైదరాబాదులో ఉగ్రవాదులు బ్లాస్టులు జరిపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలు కూడా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదులోనే ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాదు తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉండడంతో ఈ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్తాన్ దేశానికి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్!..
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత మెగా సమ్మర్ క్యాంప్ : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్