Homeఆంధ్ర ప్రదేశ్అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలోనే ఉన్నారా..?

అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలోనే ఉన్నారా..?

– పార్టీ కార్యక్రమాల్లో కనిపించని మాజీ మంత్రి
– ఓటమి తర్వాత పూర్తిగా అజ్ఞాతంలో
– వైయస్సార్ కాంగ్రెస్ లో ఇదే చర్చ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :- ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఓటమి తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. అయితే ఇలా సైలెన్స్ పాటించిన చాలామంది నేతలు ఇటీవల యాక్టివయ్యారు. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ మాత్రం లేకుండా పోతోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదన నేపథ్యంలో నేతలంతా స్పందిస్తున్నారు. మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తీరుపై ఇటీవల వైసిపి నేతలు ఆందోళనలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇంత జరుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్ జాడ లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తోంది.

దూకుడు కలిగిన నేత…
అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ హయాంలో దూకుడు కలిగిన నేత. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా కూడా ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయింది. కానీ ఇంతవరకు నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై దృష్టి పెట్టలేదు. అటు నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంపై కూడా ఫోకస్ చేయలేదు. కనీసం నెల్లూరు కూడా రావడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ కాకపోవడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ 2008లో నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేటర్ అయ్యారు. ఆ సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో నెల్లూరు నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 90 స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఓడిపోయిన నాటి నుంచి వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్న ప్రచారం ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు