Homeఆంధ్ర ప్రదేశ్నేడు ఇంట‌ర్ ఫ‌లితాలు...ఉద‌యం 10.30 గంట‌లకు వెల్ల‌డి...!

నేడు ఇంట‌ర్ ఫ‌లితాలు…ఉద‌యం 10.30 గంట‌లకు వెల్ల‌డి…!

అమ‌రావతి, క్రైమ్ మిర్ర‌ర్: ఏపీ ఇంట‌ర్ మీడియ‌ట్ ఫ‌లితాలు నేడు బుధ‌వారం విడుద‌ల చేస్తున్న‌ట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఉద‌యం 10.30డంట‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా లేదా 9552300009 నంబరుకు మెసేజ్‌ చేసి వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. విద్యార్థులకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు. ఫస్టియర్‌ 5.31 లక్షలు, సెకెండియర్‌ 5.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10లక్షల మంది పరీక్షలు రాశారు.

గతంలో ఒకేరోజు రెండు మూడు సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. ఇంటర్‌ విద్య మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక రోజు ఒక్క సబ్జెక్టుకే పరీక్ష జరిపారు. అలాగే అదనపు సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేక మెమో రూపంలో ఇస్తారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు