Homeక్రైమ్ఘ‌ట్కేస‌ర్‌లో అమానుష ఘ‌ట‌న‌...నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన వైనం...!ప‌రిస్థితి విష‌మం

ఘ‌ట్కేస‌ర్‌లో అమానుష ఘ‌ట‌న‌…నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన వైనం…!ప‌రిస్థితి విష‌మం

ఘ‌ట్‌కేస‌ర్, క్రైమ్ మిర్ర‌ర్: త‌న కొడుకొను ఇంటిలో అంద‌రూ చిన్న చూపిస్తున్నారే కోపంతో నాలుగేళ్ల చిన్నారిపై యాసిడితాగించిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఎక్క‌డ ర‌క్ష‌ణ ఉందో అర్థం ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. తాజాగా త‌న కొడుకును చిన్న చూపు చూస్తున్నార‌నే కోపంతో తోడికోడ‌లు కుమారుడికి యాసిడ్ తాగించిన అమానుష ఘ‌ట‌న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీ ఉన్నారు. వారిద్ద‌రు ఒకే ఇంటిలో ఉంటున్నారు. వారికి వివాహాలై పిల్ల‌లు కూడ అయ్యారు. కాగా పెద్ద‌కుమారుడి కొడుకు (4) పై తాత ఎక్కువ ప్రేమ చూపిసు్త‌న్న‌డాని త‌న బిడ్డ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే చిన్న కోడ‌లు మంజు క‌క్ష పెంచుకుంది.

ఇటీవల తాత తన చేతిపై పెద్ద కుమారుడి కొడుకు పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. దీంతో ఆమె పిల్లాడిని అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇటీవల ఇంట్లో చిన్నారి నోరు, ముక్కు మూసి చేతులు పట్టుకుంది. బాలుడి తల్లి గమనించి, ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది. మరోసారి ఆ బాలుడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్పై కూర్చోబెట్టింది. ఇది గమనించిన తాత ఆమెను మందలించాడు. ఈ నెల 9న మంజుల అతడిని కిచెన్లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి.. యాసిడ్ తాగించింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం రాత్రి చిన్నారి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు