Sunday, March 8, 2026
Homeఅంతర్జాతీయంRussian Oil Imports: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?

Russian Oil Imports: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య, విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరూ సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం  విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేస్తుందా? అని మీడియా ప్రశ్నిస్తే.. దాని గురించి తనకు తెలియదని, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ను అడగడం మంచిదని సమాధానమిచ్చారు.

అటు ఇదే అంశంపై శనివారం పీయూష్‌ గోయల్‌ను అడిగితే.. ‘రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుంది’ అంటూ దాటవేశారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పీయూష్‌ గోయల్‌ కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో చమురు కొనుగోలు కోసం చర్యలు చేపడుతున్నామని మాత్రమే చెప్పారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామన్న భారత హామీ మేరకు 25శాతం అదనపు సుంకాలు తొలగిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీచేశారు. భారత్‌ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రష్య చమురును కొనుగోలు చేస్తే.. మళ్లీ 25శాతం సుంకాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురు కొనుగోళ్లు నిలిపేస్తామని భారత్‌ నుంచి తమకు అధికారిక సమాచారమేదీ రాలేదని రష్యా ప్రకటించింది. తనకు వీలైన చోట చమురు కొనుగోలు చేసే హక్కు భారత్‌కు ఉందని వెల్లడించింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments