HomeజాతీయంIndia Corruption: భారత్ లో తగ్గిన అవినీతి.. సంచలన విషయాలు వెల్లడించిన తాజా రిపోర్టు?

India Corruption: భారత్ లో తగ్గిన అవినీతి.. సంచలన విషయాలు వెల్లడించిన తాజా రిపోర్టు?

India Ranks 91st in Global Corruption Index 2025: అవినీతి దేశాలకు సంబంధించి ట్రాన్స్‌ పరెన్సీ ఇంటర్నేషనల్‌  2025కు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. గత ఏడాదికి గాను భారత్‌ 91వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చే సంస్కృతి, ప్రభుత్వ నిధుల మళ్లింపు, బంధుప్రీతి, నెపోటిజం, అవినీతిని ప్రశ్నించేవారికి, జర్నలిస్టులకు ఎంతవరకూ రక్షణ ఉంది అనే అంశాల ఆధారంగా ఆయా దేశాలకు 0 నుంచి నుంచి 100 దాకా స్కోరు ఇవ్వడం ద్వారా ఈ జాబితా రూపొందిస్తారు.

39 స్కోరుతో.. 91 స్థానంలో భారత్

తాజా నివేదికలో భారత్‌ 39 పాయింట్లు సాధించింది. మాల్దీవులు, మొరాకో, ట్యునీషియాతో సమానంగా 91వ స్థానంలో నిలిచింది. 2024 ఏడాది స్కోరు (38)తో పోలిస్తే 2025లో భారత్‌ స్కోరు ఒక్క పాయింట్‌ మేర మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి సమస్య నానాటికీ పెరిగిపోతోందని.. అవినీతికి సంబంధించి ప్రపంచ దేశాల సగటు స్కోరు దశాబ్దకాలంలోనే అతి తక్కువగా 42కు పడిపోవడం, మూడింట రెండొంతుల దేశాల స్కోరు 50లోపే ఉండడం ఆందోళన కలిగిస్తోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తన నివేదికలో పేర్కొంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో.. నానాటికీ పెరుగుతున్న అవినీతిపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు.. పలు దేశాల్లో యువత ఈ అవినీతికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నట్టు తెలిపింది.

అవినీతి తక్కువగా ఉన్న దేశంగా డెన్మార్క్

ఈ జాబితాలో 89 స్కోరుతో డెన్మార్క్‌ అతి తక్కువ అవనీతి ఉన్న దేశంగా అగ్రస్థానంలో నిలవగా.. ఫిన్‌లాండ్‌ (88), సింగపూర్‌(84), న్యూజిలాండ్‌(81), నార్వే(81), స్వీడన్‌(80), స్విట్జర్లాండ్‌(80), లగ్జెంబర్గ్‌(78), నెదర్లాండ్స్‌(78) జర్మనీ(77) టాప్‌ 10లో ఉన్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు