HomeతెలంగాణCrime Mirror Updates 29-11-25:తెలంగాణ ఈనాడు ముఖ్యమైన వార్తలు

Crime Mirror Updates 29-11-25:తెలంగాణ ఈనాడు ముఖ్యమైన వార్తలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:

BRS దీక్షా దివస్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా ఈరోజు BRS పార్టీ ‘దీక్షా దివస్’ నిర్వహిస్తోంది. పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నకిలీ రిపోర్టర్ అరెస్ట్: తెలంగాణ గవర్నర్ కార్యక్రమంలో నకిలీ జర్నలిస్ట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద పలు జాతీయ మీడియా సంస్థల లోగోలతో మైక్రోఫోన్లు లభ్యమయ్యాయి.

ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు ఆదేశాలు: ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్లు ఇచ్చే విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

నదుల అనుసంధానంపై లేఖ: గోదావరి-కృష్ణా లింక్ ప్రాజెక్ట్‌లో నీటి కేటాయింపులపై సర్దుకుపోవాలని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

హైదరాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్: నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి KBR పార్క్ వద్ద అత్యాధునిక మల్టీ-లెవల్ స్మార్ట్ పార్కింగ్ సదుపాయాన్ని GHMC ఈరోజు అధికారికంగా ప్రారంభించనుంది.

పాన్ మసాలా ఓనర్ కోడలి సూసైడ్: పాన్ మసాలా వ్యాపారి కుటుంబానికి చెందిన ఓ కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు