Homeక్రైమ్హ్యాపీ హోమ్స్ కాలనీలో ఘోరం.. స్నేహితుడిని కత్తులతో పొడిచి దారుణ హత్య!

హ్యాపీ హోమ్స్ కాలనీలో ఘోరం.. స్నేహితుడిని కత్తులతో పొడిచి దారుణ హత్య!

క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు స్నేహితుల చేతిలోనే దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది. ఉప్పల్ పల్లిలోని హ్యాపీ హోమ్స్ ప్రాంతంలో నివాసముంటున్న వసీం (28) అనే యువకుడిని అతడి స్నేహితులైన సోహెబ్ (26), ఇలియాస్ (27) తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. విచారణలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసీంతో పాటు నిందితులిద్దరిపై గతంలో ఎన్‌డీపీఎస్ (మత్తు పదార్థాల) కేసులు నమోదయ్యాయి. వీరంతా కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. అయితే తాము మత్తు పదార్థాలు విక్రయిస్తున్న విషయాన్ని వసీం పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానం సోహెబ్, ఇలియాస్‌లలో బలపడింది. దాంతో అతడిపై తీవ్ర కక్ష పెంచుకున్నారు.

బుధవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. గురువారం సాయంత్రానికి వివాదం మరింత ముదరడంతో సోహెబ్, ఇలియాస్ ఇద్దరూ కలిసి వసీంపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వసీం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ మరియు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
also read : నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం.. చితకబాదిన గ్రామస్థులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు