Homeక్రైమ్ఘోర రోడ్డు ప్ర‌మాదం...! మిమిక్రీ ఆర్టిస్టు దుర్మ‌ర‌ణం...

ఘోర రోడ్డు ప్ర‌మాదం…! మిమిక్రీ ఆర్టిస్టు దుర్మ‌ర‌ణం…

హైద‌రాబ‌బాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌:క‌ళారంగంలో గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు, వెంట్రిక్విజం, మ్యాజిక్ క‌ళాకారుడు స‌త్య‌నారాయ‌ణ‌(40) రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన ఘ‌ట‌న ప‌లువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఔట‌ర్ రింగ్‌రోడ్డులో బ‌తుక‌మ్మ సంబురాల‌నుముగించుకొని ఆదివారం రాత్రి జ‌రిగిన రో్డ్డు ప్ర‌మాదంలో మృతి చెందడం యావ‌త్ క‌ళారంగానికి తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. హకీంపేటలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తన కళా ప్రదర్శనను ముగించుకున్న సత్యనారాయణ కారులో హయత్‌నగర్‌ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆయన కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాం ఆచూకీ కోసం విచారణ చేస్తున్నారు.

తెలంగాణ ఆర్టిస్టు అసోసియేష‌న్ సంతాపం…

సత్యనారాయణ గత 15 ఏళ్లుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ రంగాల్లో కళాకారుడిగా కొనసాగుతున్నారు. తన ప్రతిభతో ఇప్పటివరకు 2 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఆయన పలువురిని అలరించారు. వివిధ కార్యక్రమాల్లో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందారు. కళాకారుడిగా కొనసాగుతున్న సత్యనారాయణ అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహచర కళాకారులను తీవ్ర విషాదంలో ముంచింది. సత్యనారాయణ మృతిపై తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల వేణుతో పాటు పలువురు కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని పేర్కొంటూ సంతాపం తెలిపారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ” నాకు ‘బాహుబలి’ కాదు.. ఆ సినిమానే ప్రత్యేకం”- రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
  2. “ది డర్టీ పిక్చర్ 2″పై నిర్మాత ఏక్తా కపూర్ భారీ అప్‌డేట్.. ఈసారి కథానాయిక ఎవరు?
  3.  ఢిల్లీ మెట్రోలో సీటు కోసం గొడవ.. వ్యక్తి మృతి, మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్!
  4.  ఢిల్లీలో నిరసనలకు బ్రేక్‌.. జంతర్ మంతర్‌లో ధర్నాలపై పోలీసుల కీలక నిర్ణయం!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు