Homeక్రైమ్దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువతిపై పలువురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 24న తెల్లవారుజామున వార్ధా రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన యువతి చంద్రాపూర్‌లోని బంధువులను కలిసిన అనంతరం సేవాగ్రామ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో వార్ధా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఓ ఆటో డ్రైవర్‌ బస్ డిపోకు తీసుకెళ్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు.

అయితే బస్ డిపోకు తీసుకెళ్లకుండా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వారి నుంచి తప్పించుకున్న యువతి తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడికి కొంతసేపటి తర్వాత మరికొందరు వ్యక్తులు వచ్చి ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తులు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో మొదటి దాడికి పాల్పడిన వారిలో కొందరు కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కొందరు ఆటో డ్రైవర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు రైల్వే ఎస్పీ మంగేష్ షిండే తెలిపారు. పూర్తి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
also read : నేపాల్‌కు మరోసారి వరద ముప్పు.. బాగ్‌మతి నది ఉగ్రరూపం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు