Homeతెలంగాణభారీ వర్షాలు..... ఆదర్శంగా నిలిచిన దేవరకొండ కోర్టు సిబ్బంది

భారీ వర్షాలు….. ఆదర్శంగా నిలిచిన దేవరకొండ కోర్టు సిబ్బంది

క్రైమ్ మిర్రర్, దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం వరదతో నిండిన పరిస్థితుల్లో కూడా దేవరకొండ కోర్టు సిబ్బంది తమ బాధ్యతల పట్ల అచంచలమైన నిబద్ధతను చూపించారు. పట్టణంలోని రహదారులు, కాలనీలు నీటమునిగినప్పటికీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎస్. హరీష్ బాబు నేతృత్వంలో కోర్టు సిబ్బంది సమయానికి కోర్టుకు హాజరై విధులు నిర్వహించారు.

Also Read:షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు..!

భారీ వర్షం కారణంగా ప్రవేశ మార్గాలు మునిగిపోయినా, సేవా స్పూర్తితో ముందుకు వచ్చిన సిబ్బంది తమ హాజరుతో ప్రజాసేవ పట్ల ఉన్న కట్టుబాటును మరొక్కసారి చాటిచెప్పారు.

స్థానికులు ఈ ఘటనను ప్రశంసిస్తూ ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా విధులను నిర్వర్తించడం నిజంగా ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. దేవరకొండ కోర్టు సిబ్బంది చూపిన ఈ క్రమశిక్షణ, విధి నిబద్ధత ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రేరణగా నిలిచింది.

Also Read:తుఫాన్ ఎఫెక్ట్… భారీ వాహనాలకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు