HomeతెలంగాణBig Breaking: ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కి నోటీసులు జారీ..!

Big Breaking: ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కి నోటీసులు జారీ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ స్పందన తెలిపింది.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు, ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం (మార్చి 25, 2026) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. స్పీకర్ నిర్ణయంపై తమ వివరణతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు వారిని ఆదేశించింది.

ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16, 2026కు కోర్టు వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు