Homeఆంధ్ర ప్రదేశ్జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్...!

జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్…!

  • జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్…!

  • 14 మందితో ప్రత్యేకంగా కమిటీ..!

Crime Mirror, AP State Bureau: ఏపీలో కీలకంగా ఉన్న జనసేన పార్టీలో చేరికలకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు అనేక జిల్లాలకు చెందిన నాయకులతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు.

అదే ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునే విషయంలో జనసేన పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటి వరకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న జనసేన పార్టీలో మాత్రం భారీ సంఖ్యలో చేరికలు జరగలేదు.

Also Read: ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదు.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ – Crime Mirror

ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా బలవపేతం కావడం కొంత ఇబ్బందికరంగా మారుతుండడంతో పార్టీ అగ్ర నాయకత్వం ఆలోచనలో మార్పు వచ్చింది. పార్టీని బలోపేతం చేయాలంటే తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేరాలని భావిస్తే వారికి ఆహ్వానం పలకాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే జనసేనలోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులను స్వాగతం పలుకుతూ తాజాగా కీలక నిర్ణయాన్ని ఆ పార్టీ అగ్రనాయకత్వం తీసుకుంది. కొద్దిరోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చేరికల ప్రక్రియ జోరుగా ప్రారంభించేందుకు ఆ పార్టీ ఏర్పాటు చేస్తోంది.

Also Read: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం…! బ్లాక్ మెయిల్‌ – Crime Mirror

ఈ మేరకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చేరికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమిటీని కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • సమన్వయం చేసేలా జాయినింగ్స్ కమిటీ..

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో చేరే ఇతర పార్టీకి చెందిన నాయకులను పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు వెల్లడించారు.

జనసేన పార్టీలో ఇతర పార్టీలకు చెందిన నేతలతోపాటు విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్తులు చేరెందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వారిని సమన్వయం చేసేందుకు ఈ కమిటీ దోహదం చేస్తుంది. ఈ కమిటీలో 14 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్ లకు చోటు కల్పించారు.

Also Read: TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ.. – Crime Mirror

వీరితోపాటు మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కోటికల పూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్, కోరికన రవికుమార్, గంగులయ్య, టిసి వరుణ్, ఆరని మదన్ మదన్ సభ్యులుగా ఉంటారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చేరికలపై వారికి దిశ నిర్దేశం చేయనున్నట్లు పార్టీ అధినాయకత్వం వెల్లడించింది. ఇకపోతే ఏపీ తరహాలోనే తెలంగాణలోను జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. తాజాగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు చేర్చుకోవడం ద్వారా సంస్థగతంగా బలోపేతం కావడంపై జనసేన దృష్టి సారించినట్టు అయింది.

Also Read: తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభిమాని కోరిక నెరవేర్చనున్న జనసేనాని – Crime Mirror

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా జనసేనను నిలబెట్టాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఆహ్వానం పలుకుతూ ఈ నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది. అయితే జనసేన పార్టీ ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునే క్రమంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, బిజెపికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

కొన్నిచోట్ల బిజెపికి, టిడిపికి ఇబ్బందిగా ఉండే నాయకులను జనసేనలో చేర్చుకోవడం కూడా సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది.

Also Read: అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు.. – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు