-
ఆమనగల్లు తిరుపతమ్మ గోపయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో
-
తిరుపతమ్మ గోపయ్య అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ సుఖసంతోషాలతో ఉండాలి
-
ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలి
-
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన తిరుపతమ్మ గోపయ్య, అంకమ్మ తల్లి నాగులమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు దేవాలయ నిర్మాణ కర్త ఎలగపల్లి లక్ష్మీ వెంకటేష్ దంపతులు శాలువతో సన్మానించి స్వాగతం పలికారు.
గ్రామ వేద పండితులు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.అత్యంత వైభవంగా తిరుపతమ్మ గోపయ్య, అంకమ్మ తల్లి,నాగులమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్టించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతమ్మ గోపయ్య అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆమనగల్లు సర్పంచ్ పిల్లల సందీప్, లక్ష్మిదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్, పాములాపహాడ్ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య, ఉప సర్పంచ్ శాలెంరాజు, గంట స్వాతి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు,గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.