Homeతెలంగాణనేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు..!

నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు నేటి నుండి (మే 13, 2026) ప్రారంభమై మే 21, 2026 వరకు జరగనున్నాయి ఇంటర్మీడియేట్ బోర్డ్ స్పష్టం చేసింది. రోజుకు రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం (1st Year) విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం (2nd Year) విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు.

అలాగే ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు