హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాల కారణంగా గురువారం భారీగా బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి
హైదరాబాద్‌లో…
Also Read:రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ వెనుక అంతర్జాతీయ సైబర్ ముఠా.. 4,500 సిమ్ కార్డులు స్వాధీనం
గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.4300 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,46,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.3950 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలోకు రూ.10 వేల మేర పెరుగుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది.
Also Read:కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది సజీవ దహనం
