Homeక్రైమ్ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలిక మృతి..! పులివెందులలో ఉద్రిక్తత

ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలిక మృతి..! పులివెందులలో ఉద్రిక్తత

పులివెందులలో ఒక విషాద ఘటన కలకలం రేపుతోంది. సాధారణ కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ చిన్నారి… చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే… వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని క్రిస్టియన్ లైన్ వీధికి చెందిన ప్రేమ్ కుమార్, తులసీరెడ్డి దంపతుల 11 ఏళ్ల కుమార్తె మోక్షితకు అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యురాలు బాలికను పరీక్షించి చికిత్సలో భాగంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అదే ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే మోక్షిత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స కొనసాగించినప్పటికీ… సుమారు రెండు గంటల తర్వాత బాలిక మృతి చెందినట్లు ప్రకటించారు.
ఇదే సమయంలో… బాలిక మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు బాలిక మృతికి కారణం ఏమిటి..? వైద్యం లోపమా..? లేక ఇతర కారణాలా..? అనే ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

also read: సహజీవనం చేసింది మహిళ కాదు పురుషుడని తెలిసింది… ఆ తర్వాత ఏం జరిగిందంటే… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు