
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రస్తుత టీమిండియా టెస్ట్ మరియు వన్డే ఫార్మేట్ కెప్టెన్ గిల్ మరియు దిగ్గజ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీల మధ్య చాలా తేడా ఉంది అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ పేర్కొన్నారు. ప్రస్తుత యువ కెప్టెన్ గిల్ చాలా బద్ధకస్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గిల్ మరియు కోహ్లీకి చాలా తేడా ఉంది అని.. కోహ్లీలా దూకుడుగా అయితే గిల్ ఆడలేడు అని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ప్రస్తుతం గిల్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ చేయడం అనేది అతనికి ఎక్కువ భారం అవుతుంది అని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మేట్ లో రాణించాలి అంటే కచ్చితంగా దేశీ వాలి క్రికెట్లో బలోపేతం కావాలి అని గిల్ కు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ సూచించారు.
Read also : మస్కిటో కాయిల్ కారణంగా తొమ్మిదేళ్లు బాలుడు మృతి?
ఈ రోజుల్లో ప్లేయర్లు అందరూ కూడా కేవలం ఐపిఎల్ కాంట్రాక్టర్ల కోసమే ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్లేయర్లు అంతర్జాతీయ జట్టులో మంచి ప్రదర్శన కనబరచలేరు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదు అని ఈ విషయం ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థం అవుతుంది అని అన్నారు. కాగా ఈ రోజుల్లో భారత జట్టు క్రికెట్ అభిమానులు అందరూ కూడా గిల్ ను కోహ్లీలా భావిస్తారు. భారత్ క్రికెట్ జట్టు ఫ్యూచర్ మొత్తం కూడా గిల్ పై ఆధారపడి ఉంది అని ఇప్పటికే ఎంతోమంది చెప్పిన విషయం కూడా తెలిసిందే. కానీ గత కొద్ది రోజుల నుంచి శుభమన్ గిల్ పేలవ ప్రదర్శన చేస్తున్నారు. దీంతోనే అతనిపై చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అతని బదులు ఇతర క్రికెటర్లకు ఛాన్సులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.
Read also : అయ్యప్ప స్వామి భక్తులు అలర్ట్.. మకర జ్యోతి ఆరోజునే?





