Homeక్రైమ్ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం!

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం!

క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగ అవకాశం కల్పిస్తానని నమ్మించి ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, వీడియోలు తీసి వేధింపులకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌కు చెందిన 41 ఏళ్ల మహిళకు గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన దీపక్ బన్సాల్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన దీపక్, గత మార్చి 4న ఉద్యోగం విషయమై మాట్లాడాలని చెప్పి మండావళి ప్రాంతానికి రప్పించాడు. అక్కడ ఆమెకు మత్తు పదార్థం కలిపిన పానీయం అందించాడు.
బాధితురాలు స్పృహ కోల్పోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం తేరుకున్న మహిళను బెదిరించడమే కాకుండా ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, ఉంగరం, గొలుసును లాక్కున్నాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనకి పోలీసు శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని భయపెట్టాడు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులకు దిగాడు.
నిందితుడి బెదిరింపులకు భయపడిన బాధితురాలు కొన్ని నెలల పాటు మిన్నకుండిపోయింది. అయితే దీపక్ వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో ధైర్యం చేసి చివరకు పోలీసులను ఆశ్రయించింది. సెప్టెంబర్ 22న నిందితుడిపై సంబంధిత చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దీపక్ కోసం గాలిస్తున్నామని, బాధితురాలికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
also read : సిగ్మా ప్రీ రిలీజ్‌కు మెగాస్టార్.. సందీప్ కిషన్ సినిమాకు భారీ హైప్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు