Homeతెలంగాణఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ప్రారంభం

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

  • నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’

  • పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్,క్రైమ్ మిర్ర‌ర్‌: నగరంలోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘ఎల్లిపాయకారం’ నూతన అవుట్‌లెట్ ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఘనంగా ప్రారంభించారు.గచ్చిబౌలిలోని ఎల్లో సఫైర్ హోటల్స్ వ‌ద్ద జ‌రిగిన‌ ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, న‌టి కె సుధ, న‌టులు మధు దామరాజు, మహేష్ ఆచంట, షఫీ, ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని రుచుల‌ను ఆస్వాదించారు.

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ప్రారంభం
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఎల్లిపాయ కారంను నగర ప్రజలకు అందించడం అభినందనీయం. ఎల్లిపాయ కారం మరో బ్రాంచి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు. తెలిపారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఎల్లిపాయకారం ఐటీ ప్రాంతంలో నాటు రుచులను అందించడం అభినందనీయం. ఆరోగ్య పరంగా ఎల్లిపాయకారం ఎంత మంచిదో ఈ రెస్టారెంట్ అలాంటి ఆహారం అందించాలి. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఎల్లో శాఫిరే హోటల్ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు.

నూతనంగా ప్రారంభమైన ఈ ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్ ‘ అవుట్‌లెట్‌లో సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండ‌ర్ గంగా విరజ్ కోట, కో-ఫౌండ‌ర్ సాయిశ్రీ తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నాటురుచులను ఫాస్ట్ ఫుడ్ తరహాలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎల్లిపాయకారం – గచ్చిబౌలి అవుట్‌లెట్‌ను సిద్ది వినాయక ఫుడ్ ఆండ్ బేవరేజ్ కంపెనీ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు.

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ప్రారంభం
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

ఎల్లిపాయకారం చికెన్ వేపుడు, ప్రవున్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని రకాల ఈవెంట్స్‌కి క్యాట‌రింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అతిథులు, ‘ఎల్లిపాయకారం’ బ్రాండ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించి యువతతో పాటు కుటుంబాలకూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సెలబ్రిటీల సందడి, స్థానికుల ఉత్సాహంతో గచ్చిబౌలిలో జరిగిన ఈ ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త అవుట్‌లెట్ ప్రారంభంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ లవర్స్‌కు మరో రుచికరమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు