Homeతెలంగాణఆర్టీసీలో ఎన్నికల సందడి...! 8 ఏళ్ల త‌రువాత గుర్తింపు ఎన్నిక‌లు...

ఆర్టీసీలో ఎన్నికల సందడి…! 8 ఏళ్ల త‌రువాత గుర్తింపు ఎన్నిక‌లు…

  • తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు కాంగ్రెస్ మద్దతు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల సందడి ప్రారంభం అయింది. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు అక్టోబర్ 9న పోలింగ్ జరగనుంది. దీంతో కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఒక యూనియన్ ప్రకటించడం చర్చనీయాంసంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు తమ మద్దతు ఇస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ మద్దతు ఆ యూనియన్కే నంటూ బాహటంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.

సన్నాహక సమావేశం…

ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, టీ డబ్ల్యూ యు ప్రతినిధులు హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, పని పరిస్థితులు, పెండింగ్ అంశాలు, ఆర్టీసీ భవిష్యత్ తదితర అంశాలపై చర్చ జరిగింది. టి డబ్ల్యూ యు విజయం కోసం క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఆర్టీసీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిపిసిసి ఉపాధ్యక్షుడు, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్మిక సంఘం ప్రతినిధుల మధ్య సమన్వయం చూసే బాధ్యతను బొంతు రామ్మోహన్ కు అప్పగించింది.

పక్కా వ్యూహంతో కాంగ్రెస్…

ఆర్టీసీ ఎన్నికల్లో తాము మద్దతు తెలిపిన కార్మిక సంఘం విజయం సాధించేలా కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. డిపోల వారీగా పార్టీ నాయకులు, కార్మిక సంఘం ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. కాకా తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంగం ఎన్నికల షెడ్యూల్ను కార్మిక శాఖ ఈనెల 18న విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కోసం అక్టోబర్ 14, 15వ తేదీలను కేటాయించారు. అక్టోబర్ 17న ఫలితాలను ప్రకటించనున్నారు.

చివరిసారిగా 2016లో…

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు చివరిసారిగా 2016లో జరిగాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆర్టీసీలో గుర్తింపు సంఘం హోదా కోసం పలు కార్మిక సంఘాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ తో పాటు ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఘ, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వంటి సంఘాలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న పోటీ చేసే యూనియన్లకు ఎన్నికల గుర్తును కేటాయించనున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. జ్ఞానేశ్ కుమార్‌పై పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్
  2. ఆసియా క్రీడల అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా.. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు
  3. ‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి మాస్ అవతార్.. రాహుల్ రామకృష్ణ కామెంట్స్‌కు ఫన్నీ రిప్లై
  4. కొడుకు మరణించినా కోడలికి అండగా నిలిచింది.. మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితం అందించింది…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు