మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను, మర్రిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మునయ్య, మాజీ సర్పంచ్ నల్ల యదయ్య గౌడ్, సూపర్డెంట్ యాకుబ్, పంచాయతీ కార్యదర్శి యూసుఫ్, వార్డు సభ్యులు ఎండి జమీర్, మహేశ్వరం యాదమ్మ రమేష్, నల్ల చంద్రశేఖర్ గౌడ్, సిలివేరు రఘు, తిరుమని అంజమ్మ, పందుల రాములు గౌడ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్, మీడియా ప్రతినిధులు గునుగంటి యదయ్య, గొట్టిముక్కుల ప్రకాష్, స్థానికులు ఈద రాములు, అమంచ రమేష్, పల్లె ప్రవీణ్, ఎడ్ల ముత్తయ్య, అబ్రహం, నజీర్, ఆర్నల్, రవి, నగేష్, గౌస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
