Homeలైఫ్ స్టైల్ఎండాకాలం సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడుతున్నారా.. జరిగేది ఇదే...!

ఎండాకాలం సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడుతున్నారా.. జరిగేది ఇదే…!

 

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ఈమధ్య కాలంలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. సూర్యరశ్మిలోకి వెళ్లినా కూడా ఈ లోపం కనిపించడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు మన జీవనశైలి, ఆహారం, శరీర స్వభావం వంటివి. ఈ నేపథ్యంలో సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడటం వల్లే విటమిన్ -డి తగ్గుతుందా అనే సందేహం చాలామందిలో ఉంది.

ఇది నిజమేనా..!

సాధారణంగా సూర్యరశ్మిలోని కిరణాలు చర్మంపై పడితే మన శరీరం విటమిన్ D తయారు చేస్తుంది. అయితే సన్‌స్క్రీన్ వాడితే ఆ కిరణాలు చర్మానికి పూర్తిగా చేరకుండా కొంత వరకు అడ్డుకుంటాయి. దీంతో విటమిన్ D ఉత్పత్తి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ సన్‌స్క్రీన్ వాడటం వల్ల పూర్తిగా విటమిన్-డి తగ్గిపోతుంది అనుకోవడం తప్పు.

నిజానికి మనం సన్‌స్క్రీన్ వాడినా, బయటకు వెళ్లే సమయం, సూర్యరశ్మిలో గడిపే సమయం, చర్మం రంగు, వయస్సు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్లే శరీరానికి అవసరమైన విటమిన్-డి అందుతుంది. కాబట్టి సన్‌స్క్రీన్ వాడటం మానేయాల్సిన అవసరం లేదు.

ఇలా చేయండి..!

విటమిన్- డి సరిపడా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు సూర్యరశ్మిలో గడపడం మంచిది. అలాగే పాలు, పెరుగు, గుడ్లు, చేపలు వంటి పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామం కూడా శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవసరమైతే వైద్యుల సలహాతో మాత్రలు తీసుకోవచ్చు.

సన్‌స్క్రీన్ వాడటం తప్పు కాదు. అది చర్మాన్ని రక్షించడానికి అవసరం. అయితే అదే సమయంలో సూర్యరశ్మిని పూర్తిగా దూరం చేయకుండా, సరైన సమయాల్లో కొంతసేపు బయట గడపడం ద్వారా విటమిన్-డి లోపాన్ని నివారించవచ్చు. సరైన అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు

తాజావార్తలు