-
బల్దియా ఎన్నికలు ప్రతికూలంగా వస్తాయని ఆందోళన
-
నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన
-
ఉద్దేశపూర్వక తప్పిదం అంటున్న ప్రత్యర్ధులు
-
ఎంత జాప్యం జరిగితే అధికార పార్టీకి అంత నష్టం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందా? ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదా? పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తరుణంలో ఇబ్బందికర ఫలితాలు వస్తాయని భావిస్తోందా? దాటవేత ధోరణి మేలు అన్న నిర్ణయానికి వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తెలంగాణ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. వార్డుల పునర్విభజన ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసి.. సరిహద్దులను శాస్త్రీయంగా మళ్ళీ నిర్ణయించే వరకు ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు ఆ స్టే ఎత్తివేతకు సంబంధించి న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం లేదు.
ఆ ఊపు కొనసాగించి ఉంటే…
Also Read: నటుడవ్వాలని కల కూడా కనలేదు.. నెలకు రూ.400 జీతంతో మొదలైన నాజర్ సినీ ప్రయాణం!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ చక్కటి ఫలితాలను పొందింది. అదే ఊపుతో కొనసాగించి ఉంటే గ్రేటర్ సైతం కాంగ్రెస్ పార్టీకి చిక్కేది. చాలా ఆలస్యం చేసింది. కోర్టులో సైతం చిక్కుముడులు అధికం అవుతున్నాయి. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం జిహెచ్ఎంసి చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం ప్రతి వార్డు పరిధిలోని జనాభా ప్రాతిపదికన మాత్రమే సరిహద్దుల నిర్ణయం జరగాలి. కానీ ప్రస్తుతం చేసిన పునర్విభజన జనాభా సమతుల్యతను దెబ్బతీసేలా ఉండడమే కాకుండా.. తెలంగాణ మున్సిపాలిటీల చట్టానికి విరుద్ధంగా ఉందంటూ ఆధారాలతో సహా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. అయితే ఈ న్యాయ చిక్కుముడులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఉద్దేశపూర్వక జాప్యం కోసమే ప్రభుత్వం అలా చేస్తుందనేది ప్రధాన ఆరోపణ.
గ్రేటర్ లో వ్యతిరేకత…
Also Read:‘హతః’లో ఏదో వింత ప్రపంచం.. నల్ల పిల్లితో ఆసక్తికరంగా ఫస్ట్ అప్డేట్!
గ్రేటర్ ఎన్నికలను ఎంత ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత నష్టం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత పట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి లేదు. హైడ్రా కూల్చివేతలు, ఆస్తుల క్రమబద్ధీకరణ, మూసి ప్రక్షాళన ప్రాజెక్టుల వల్ల ఉత్పన్నమైన ప్రజాగ్రహం ఎన్నికల్లో తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయం అధికార పక్షాన్ని వెంటాడుతోంది. ఈ పొలిటికల్ రిస్క్ ను ముందే ఊహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కావాలనే వార్డుల విభజనను అస్తవ్యస్తంగా జరిపిందనేది ప్రత్యర్థుల ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన చేస్తే విపక్షాలు కచ్చితంగా కోర్టుకు వెళ్తాయి. ఆ విధంగా ఎన్నికలు వాయిదా పడితే తమకు మరింత సమయం దొరుకుతుందనే ఎత్తుగడతోనే ప్రభుత్వం ఈ వివాదాస్పద రీతిలో అడుగులు వేసిందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
