Homeక్రైమ్డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ ఫిర్యాదు

డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ ఫిర్యాదు

ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి ఫోక్ సాంగ్స్‌ ద్వారా ఈశ్వర్ సాయి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందాడు. ఇదే సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం.

ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు మోసపూరిత ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరోపణలపై పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా, కేసు నమోదైన అనంతరం ఈశ్వర్ సాయి అందుబాటులో లేకుండా ఉన్నట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం: అసలు నోట్లకు బదులు నకిలీ కరెన్సీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు