Homeఆంధ్ర ప్రదేశ్వైయస్సార్సీపి రీఎంట్రీ...!

వైయస్సార్సీపి రీఎంట్రీ…!

  • తెలంగాణలో మళ్లీ యాక్టివ్

  • సారథ్యం వహించనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • రాజన్న రాజ్యం తెస్తామని ప్రకటన

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పురుడుబోసుకోనుందా? మళ్లీ ఆ పార్టీ రీఎంట్రీ ఇస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా పక్కదారి పడుతున్నాయని.. ఈ తరుణంలో మార్పు దిశగా బలమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై టీం ప్రతినిధులు నిర్వహించిన ప్రత్యక్ష ట్విట్టర్ స్పేస్ లో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. దీంతో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీఎంట్రీ ఉంటుందా అన్న అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజలకు మేలు చేసే ఒక బలమైన రాజకీయ వేదికను పునర్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నానని.. అందుకే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్భయంగా ఖండిస్తున్నానని గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి.

రాజశేఖర్ రెడ్డి పాలన గుర్తుచేస్తూ…

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను గుర్తు చేశారు. ఆయన సంక్షేమ పంథానే తనకు ఆదర్శంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో సంక్షేమ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఎంతో కీలకమైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేని దయనీయ స్థితిలో ఉందని విమర్శించారు. రాజకీయానికి కేవలం వ్యాపారంగా మార్చుకొని.. పైసలు సంపాదించడమే ధ్యేయంగా వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడలేరని చెప్పుకొచ్చారు.

అవినీతిపై సమరం…

Also Read:తుక్కుగూడ నర్సు శిరీష కేసులో కీలక మలుపు.. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన అవినీతి నేడు గ్రామీణ ప్రాంతాలకు చేరిందంటూ వ్యాఖ్యానించారు. రైతుబంధు లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఒక చేతితో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నటిస్తూనే.. మరో చేతిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు పెంచి ఆ డబ్బును ప్రజల నుంచి దారుణంగా గుంజుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు సంక్షేమం అందించడం కంటే వారికి తీవ్ర నష్టాన్ని చేకూరు వస్తున్నాయని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణ యుగాన్ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా త్వరలో ఒక సంచలనాత్మక నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో మళ్లీ తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీఎంట్రీ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు