Homeక్రైమ్బాలాపూర్‌లో యువకుడి దారుణ హత్య...!

బాలాపూర్‌లో యువకుడి దారుణ హత్య…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్హాన్‌ చెరువు సమీపంలో ఒక యువకుడిని (అదిత్‌ పాండే) గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారణగా..

మృతుడిని కుర్మల్‌గూడకు చెందిన అదిత్ పాండే అలియాస్ భజ్రంగ్ (24) గా పోలీసులు గుర్తించారు. ఇతను ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవాడు మరియు హైదరాబాద్‌లోని ఒక బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

శనివారం (మే 10, 2026) అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అదిత్‌ను బైక్‌పై తీసుకెళ్లి, తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు మున్నా అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు.

మున్నా కూడా వాహనాల రికవరీ పనులు చేస్తుంటాడని, తన పరిధిలోని ప్రాంతాల్లో రికవరీ పనులు చేయవద్దని గతంలో అదిత్‌ను హెచ్చరించాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. బాలాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు