Homeతెలంగాణమ‌హిళ దారుణ హ‌త్యా...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

మ‌హిళ దారుణ హ‌త్యా…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైద‌రాబ‌బాద్‌లోని నాగోల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని త‌ట్టి అన్నారం గ్రామ స‌మీపంలో మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. ఒంటిపై దుస్తులు లేక‌పోవ‌డంతో అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందు అర‌ణ్య విల్లాస్ ఎదురుగా కొత్త‌రో్డ్డులోని నిర్జ‌న ప్ర‌దేశంలో మ‌హిళ శ‌వాన్ని స్థానికులు గుర్తించారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో క్లూస్ టీం ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహం ప‌క్క‌నే మ‌ద్యం బాటిళ్ల‌ను గుర్తించారు.

మృతదేహనికి కాళ్లు, చేతులు కనిపించకపోవడం కలకలం రేపింది. కుక్కలు పీక్కుతింటూ ఉండగా చూనసిట్లు మార్నింగ్ వాకర్స్‌ చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలు ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు. మహిళ కనిపించడం లేదంటూ గత నెల 28న ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. AI ఫోటోలతో మహిళకు వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై కేసు
  2. నకిలీ విద్యార్హత పత్రాలతో ఉద్యోగాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
  3. “బిగ్ బాస్” ఫేమ్ అర్చనా గౌతమ్ కేఫ్‌లో చోరీ.. క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లిన దొంగ
  4.  మంత్రి పర్యటనలో అనుకోని ప్రమాదం..  సర్వీస్ రైఫిల్‌ పేలడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు