హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:గాంధీనగర్ పీఎస్ పరిధిలోని కవాడిగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఓ మహిళను దుండగుడు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.