Homeతెలంగాణబీఆర్ ఎస్‌...ఇక‌ టీఆర్ ఎస్ గా మార‌నుంది.... పున‌రుద్ద‌ర‌ణ‌కు ముహూర్తం ఫిక్స్‌...!

బీఆర్ ఎస్‌…ఇక‌ టీఆర్ ఎస్ గా మార‌నుంది…. పున‌రుద్ద‌ర‌ణ‌కు ముహూర్తం ఫిక్స్‌…!

  • జగిత్యాలలో కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: టిఆర్ఎస్ పునరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ చేశారా? తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తిరిగి ప్రకటించనున్నారా? భారత రాష్ట్ర సమితిని సాగనంపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల గులాబీ పార్టీ నేతల్లో ఒక రకమైన చర్చ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్ర సమితి బదులు తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిని పునరుద్ధరిస్తామని… ఆ ఆలోచనతో ఉన్నామని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. దీనిపై కేసీఆర్ సైతం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. జగిత్యాల లో జరిగే సభలో ఫుల్ క్లారిటీ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అప్పటి నుంచి అపజయాలు…

ఏ ముహూర్తాన భారత రాష్ట్ర సమితిని ప్రకటించారో అప్పటినుంచి అనేక రకాల కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ నుంచి పార్టీ దూరమైంది. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పార్టీ కోల్పోయింది. దాని పర్యవసానమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం. కేవలం పార్టీ పేరు మార్పు సెంటిమెంట్ గులాబీ పార్టీని పాతాళంలోకి నెట్టింది. దాని నుంచి బయటపడేందుకు తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ప్రకటనకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధపడుతోంది.

దేశ రాజకీయాలను వెతుక్కుంటూ 2022లో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు కెసిఆర్. నాడు హైదరాబాదులోని ప్రగతి భవన్ లో దేశంలోని కీలక రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీ ప్రతినిధులను పిలిచి కెసిఆర్ ఆర్భాటంగా భారత రాష్ట్ర సమితి పేరును ప్రకటించారు. మనది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ అంటూ తేల్చి చెప్పారు. అది మొదలు ఆ పార్టీని ఆదరించడం మానేశారు తెలంగాణ ప్రజలు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక రకమైన లోకల్ ఫీవర్, ఫ్లేవర్ ఉంది.

ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ అనేది పండింది. టిఆర్ఎస్ పేరు ఉన్నన్ని రోజులు మంచి విజయాలే దక్కుతూ వచ్చాయి. ఉద్యమ పార్టీ గాను.. రాజకీయ పార్టీ గాను తెలంగాణ రాష్ట్ర సమితి సక్సెస్ అయ్యింది. కానీ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తరువాత పరాజ్యాలను మూటగట్టుకుంది. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. బై పోల్స్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో భారత రాష్ట్ర సమితిని సాగనంపి.. తెలంగాణ రాష్ట్ర సమితిని తెచ్చుకుందాం అంటూ కేటీఆర్ తన పార్టీ నేతలు వద్ద కూడా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జగిత్యాల సభకు కేసిఆర్…

చాలా రోజుల తర్వాత కెసిఆర్ బయటకు వస్తున్నారు. జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరనున్నారు. ఈనెల 20న జరిగే ఈ కార్యక్రమానికి కెసిఆర్ హాజరుకానున్నారు. అదే వేదికపై తెలంగాణ రాష్ట్ర సమితి పునరుద్ధరణ పై ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీ శ్రేణులకు గట్టి సంకేతాలు పంపించనున్నారు. వెనువెంటనే తీర్మానం చేసి పేరు మార్పునకు అంగీకరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు